ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ సవాంగ్ - రాయనపాడులో శ్రాేమిక్ రైలు ప్రారంభం

కృష్ణా జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్​లో శ్రామిక్ రైలును రాష్ట్ర డీజీపీ ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సుమారు వెయ్యి మంది ప్రయాణికులు వారి స్వస్థలాలకు పయనమయ్యారు.

DGP Sawang,  started the Shramik train in rayanapadu krishna district
శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ సవాంగ్

By

Published : May 27, 2020, 7:37 AM IST

శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ సవాంగ్

విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌లో శ్రామిక్‌ రైలును రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ఈ రైలును సిగ్నల్‌ ద్వారా ప్రారంభించారు. సుమారు వెయ్యి మంది వలస కార్మికులు వారి స్వరాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌కు బయల్దేరారు.

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని డీజీపీ పేర్కొన్నారు. రైలులో ప్రయాణించే వారికి భోజనం, నీళ్లు, పండ్లు తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఇదీచదవండి.

'వైకాపా ప్రభుత్వం మాట తప్పి.. మడమ తిప్పింది'

ABOUT THE AUTHOR

...view details