కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు, స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. బ్రహ్మోత్సవాలు, సెలవు రోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
ఆలయానికి పోటెత్తిన భక్తులు