ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనిఫెస్టో తప్పక పాటిస్తామన్న తెదేపా నేతలు - మున్సిపల్ ఎన్నికలు

విజయవాడ పశ్చిమ 48వ డివిజన్​లో తెదేపా నేతలు దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్​​ మీరాలు పాల్గొన్నారు. పేదల సంక్షేమాాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన మేనిఫెస్టోను తప్పక పాటిస్తామని వారు హామీ ఇచ్చారు.

tdp leaders campaign at west vijayawada
మ్యానిఫెస్టో తప్పక పాటిస్తామన్న తెదేపా నేతలు

By

Published : Mar 2, 2021, 5:07 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48 డివిజన్ తెదేపా అభ్యర్థి పేరాబత్తుల రాజేశ్వరి తరఫున ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు పాల్గొన్నారు. మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తామని వారు హామీ ఇచ్చారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తెదేపా ప్రథమ లక్ష్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన హామీలతో మేనిఫెస్టో రూపొందించి.. ఎన్నికల బరిలో ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాలను కైవసం చేసుకొని విజయబావుటా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్లు అండగా నిలుస్తూ.. నగర అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

ABOUT THE AUTHOR

...view details