ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటకెక్కిన పారిశుద్ధ్యం... ప్రాణాలు తీస్తున్న విషజ్వరాలు - viral fevers

విషజ్వరాల విజృంభిస్తున్నాయి. వారం వ్యవధిలోనే ప్రాణాలను హరిస్తున్నాయి. విజయవాడలో నెలరోజుల్లోనే కనీసం 10 నుంచి 15 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. విషజ్వరాలకు అడ్డుకట్ట వేస్తామని అధికారులు చెబుతున్నా...ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.

అటకెక్కిన పారిశుద్ధ్యం... ప్రాణాలు తీస్తున్న విషజ్వరాలు

By

Published : Sep 21, 2019, 7:08 AM IST

విషజ్వరాలు ప్రాణాలు తీస్తున్నాయి. డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులు మృతి చెందుతున్నారు. విషజ్వరాలకు అడ్డుకట్ట వేస్తామని అధికారులు చెబుతున్నా...ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.

నెలరోజుల్లో 15మంది మృతి....

విజయవాడలో నెలరోజుల్లో వరుసగా కనీసం 10 నుంచి 15 మంది జ్వరాలతో మృతి చెందడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత ధయనీయ పారిశుద్ధ్య నిర్వహణ నగరంలో కన్పిస్తోందని... ఇంతలా విషజ్వరాలు పీడిస్తున్నా కనీసం ఫాగింగ్‌ కూడా చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. బందరు, ఏలూరు రోడ్లకు ఇరువైపులా గుంతల్లో వర్షం నీరు చేరి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధాన రహదారులకు ఇరువైపుల కూడా దోమల మందులను పిచికారీ చేసే దిక్కులేకుండా పోయిందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.

అటకెక్కిన పారిశుద్ధ్యం... ప్రాణాలు తీస్తున్న విషజ్వరాలు

కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు, అవనిగడ్డ మండలాలకు మలేరియా, టైఫాయిడ్‌ సహా డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. తిరువూరులో 18 ఏళ్ల యువతి, చైతన్యనగర్ తండాలో ఆరేళ్ల బాలుడు, విస్సన్నపేటలో ఎనిమిదేళ్ల చిన్నారి....రోజుకొకరు చొప్పున వరుసగా మూడు రోజుల్లో చనిపోయారు. తాజాగా విజయవాడ సంగ్‌నగర్‌లో ఓ యువకుడు, చిట్టినగర్‌లో 15 ఏళ్ల బాలిక జ్వరాలతోనే చనిపోయారు. చందర్లపాడు మండలం చింతలపాడులో డెంగీ లక్షణాలతో ఇద్దరు చనిపోయారు.

పై అధికారుల ఒత్తిడి....

ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, యువత జ్వరం వచ్చిన కేవలం వారం వ్యవధిలో మృత్యువాత పడుతున్నారు . ప్రైవేటు ఆస్పత్రులకు జ్వరపీడితులు వెళ్తుంటే.....రక్త పరీక్షల్లో డెంగీ, NS1 రియాక్ట్ , పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలితే వెంటనే హెచ్చరిస్తున్నారు . అనంతరం ఎలీసా పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రక్త నమూనాలు పంపుతున్నారు . కానీ నివేదికలు రావటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎక్కడైనా డెంగీ కేసు ఉందని తెలిస్తే ... ఆ కింది స్థాయి వాళ్లపై అధికారుల ఒత్తిడి పెరిగిపోతోందని... . అందుకే ఏ అధికారి డెంగీ అని తేల్చడం లేదని ఆరోపణలోస్తున్నాయి.

మసిపూసే ప్రయత్నం...!

విజయవాడ ఆస్పత్రుల్లో జులై 28 నుంచి ఆగష్టు 25 వరకు 551 డెంగీ పరీక్షలు కాగా అందులో 82 కేసులు పాజిటివ్‌ అని అధికారికంగా తేల్చారు. జనవరి నుంచి 2 వేల 9 వందల 58 నమూనాలు ఎలీసా పరీక్షలు జరుగగా కేవలం 58 మాత్రమే పాజిటివ్‌గా తేలాయి. ఆగస్టు నెలలో 473 డెంగీ పరీక్షలు నిర్వహించగా 35మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు . మరి ఈ మరణాలన్నీ ఏంటంటే....వారందరికీ ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలు ఉన్నాయని...వాటివల్లే చనిపోతున్నారని...మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.

అధికారులు స్పందించి నగరాల్లో పారిశుద్ధ్యాన్ని రక్షించగలిగితే చాలా వరకు విషజ్వరాలను అదుపులో ఉంచవచ్చని.... ప్రతిరోజూ ఫాగింగ్‌ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details