ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సచివాలయానికి వెళ్లాలంటే... అంత హడావుడి ఎందుకు? - వైకాపాపై సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యలు

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్ రైతులను అవమానిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వెళ్లాలంటే అంత హడావుడి, అంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.

సీఎం సచివాలయానికి వెళ్లటానికి ఎందుకు అంతహడావుడి
సీఎం సచివాలయానికి వెళ్లటానికి ఎందుకు అంతహడావుడి

By

Published : Nov 5, 2020, 2:02 PM IST

పాదయాత్రలో ప్రజా ప్రభుత్వం అంటూ తిరిగిన జగన్.. ఇప్పుడు ప్రజలకు అందకుండా దాక్కుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లాలంటే అంత హడావుడి అంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్ రైతులను అవమానిస్తున్నారన్నారు. ప్రశాంతంగా జరిగే ఉద్యమంలో అల్లర్లు సృష్టించాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వమే మూడు రాజధానుల పేరుతో పెయిడ్ ఉద్యమం చేయిస్తున్నారని అన్నారు. వాళ్లకి అనుమతి ఇచ్చిన పోలీసులు అమరావతి రైతులకు ఎందుకు ఇవ్వరన్నారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉంచే వరకు పోరాటం ఆగదన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమే కాదు, ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. వైకాపాలో కూడా ఓటింగ్ పెడితే మూడొంతులు అమరావతే రాజధానికే ఓటు వేస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details