పోలీసులే ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించటం అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు యువకుడిని కారుతో ఢీ కొట్టటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇసుక విధానం తెచ్చింది మాఫియా కోసమేనా అని నిలదీశారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఇసుక మాఫియా పెచ్చరిల్లిపోతుందని ఆరోపించారు. వెయ్యి కోట్ల రూపాయల ఇసుక దందా జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చని రామకృష్ణ అన్నారు.
'పోలీసులే శిరోముండనం చేయించటం అమానుషం' - cpi ramkrishna
ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇసుక విధానం తీసుకువచ్చింది మాఫియా కోసమా అని ప్రశ్నించారు.
సీపీఐ రామకృష్ణ