ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్వారంటైన్ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలి'

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలకు పౌష్టికాహారం అందించాలని కోరుతూ సీపీఐ రామకృష్ణ సీఎం జగన్​కు లేఖ రాశారు. కరోనా పరీక్షలు విస్తృతంగా చేపట్టాలని కోరారు.

cpi rama krishna letter to cm jagan
సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

By

Published : Jul 6, 2020, 12:19 PM IST

క్వారంటైన్ కేంద్రాల్లో ప్రజలకు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. కరోనా నిర్ధరణ పరీక్షలు విస్తృతంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం అందోళనకరమైన విషయమని రామకృష్ణ అన్నారు. మొదట్లో ప్రభుత్వం కరోనా పరీక్షలు విస్తృతంగా చేసినా.. ప్రస్తుతం మందకొడిగా, నిర్లక్ష్య ధోరణితో సాగుతుందని ఆరోపించారు.

చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు నాసిరకం భోజనం పెడుతున్నారని లేఖలో తెలిపారు. కరోనా తీవ్రతను తగ్గించే మందులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని రామకృష్ణ లేఖలో కోరారు.

ఇదీ చదవండి: పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్​జీటీలో విచారణ

ABOUT THE AUTHOR

...view details