ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ డీపీఆర్​ కాలనీలో సీపీఎం నిరసన - nandigama cpm latest news

కృష్ణా జిల్లా నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తమ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేశారు. పేదవారికి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు

cpi protest at nandigama dpr3 in krishna district
డీవీఆర్ కాలనీ ఫేస్​-3లో నిరసన

By

Published : Aug 23, 2020, 7:05 AM IST

కృష్ణా జిల్లా నందిగామ సీపీఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో డీవీఆర్ కాలనీ ఫేస్​-3లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో పక్కా గృహాలు మంజూరు కోసం టిడ్కో ద్వారా 1438 మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వాటిని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.

డీవీఆర్ కాలనీ ఫేస్-3 నివాసం ఉంటున్న సుమారు వెయ్యి కుటుంబాల వారికి పట్టాలు ఇవ్వాల్నారు. ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పేదలు నివసిస్తున్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్​, దోమల మందును పిచికారి చేయించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details