ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపోరు: పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం

కృష్ణా జిల్లాలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్షాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతలు, అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హామీలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం

By

Published : Feb 25, 2021, 5:38 PM IST

కృష్ణా జిల్లాలో పుర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నందిగామ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు పార్టీ శ్రేణులతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. వైకాపా నేతలకు ఓటుతో బుద్ధిచెప్పాలని లోకేశ్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం బలపర్చిన సీపీఐ అభ్యర్థి తరపున ఎంపీ కేశినేని నాని ప్రచారం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ సంపదను వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.

పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థుల తరపున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలోని 28వ డివిజన్ అభ్యర్థి పునూరు లిఖిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ కుమార్తె అయిన ఈమె... వైకాపా మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. 17వ డివిజన్​లో సీపీఎం అభ్యర్థి హరి నారాయణ ప్రచారం చేశారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతున్న తమను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details