కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో ఒకే కుటుంబంలో 7 మందికి, చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఒకరికి, మోపిదేవి మండలం, పెదకళ్ళేపల్లి గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బందరు రెవెన్యూ డివిజినల్ అధికారి ఖాజావలీ తెలిపారు.
వారం రోజుల క్రితం హైదరాబాదు నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావటంతోనే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరు అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలన్నారు. ఒకవేళ బయటికి వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలని తెలిపారు.