ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్‌ భయం..ఆలయాలకు తగ్గుతున్న భక్తులు - ఆలయాలపై కొవిడ్ ప్రభావం న్యూస్

ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 మంది కొవిడ్ బారిన పడినట్లు సమాచారం. ఆలయాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా బెజవాడ దుర్గ గుడి, శ్రీశైలంలోనే ఉంది.

virus effect on temples
ఆలయాల్లో కొవిడ్‌ భయం

By

Published : Apr 26, 2021, 7:32 AM IST

దేవాదాయశాఖకు చెందిన వివిధ ఆలయాల్లోని అర్చకులు, వేదపండితులు, ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలతో భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నప్పటికీ.. వైరస్‌ సోకిన అర్చకులు, ఉద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 మంది కొవిడ్‌ బారిన పడినట్లు దేవాదాయశాఖవర్గాల సమాచారం. ముఖ్యంగా 12 ప్రధాన ఆలయాలతోపాటు, వివిధ వారాల్లో ఎక్కువమంది భక్తులు వచ్చే పలు ఆలయాలకు చెందిన సిబ్బంది, అర్చకులు బాధితుల్లో ఉన్నారు. వీరిలో కొందరు హోం ఐసొలేషన్‌లో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విజయవాడలోని దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల్లో పాజిటివ్‌ వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు ఆలయాల్లో 40 మంది చొప్పున వైరస్‌ బారిన పడినట్లు చెబుతున్నారు. ఇందులో 10-15 మంది చొప్పున అర్చకులు ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల కిందట దుర్గ గుడికి చెందిన ఓ అర్చకుడు కొవిడ్‌తో మృతిచెందారు. గత ఏడాదీ ఇదే ఆలయానికి చెందిన ఓ వైదిక కమిటీ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం, సింహాచలం ఆలయాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. భక్తుల్లో కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, వైరస్‌ లక్షణాలు ఉన్నప్పటికీ దర్శనాలకు వస్తుండటంతో ఆ ప్రభావం అర్చకులు, ఉద్యోగులపై పడుతోందని చెబుతున్నారు. చిన్న ఆలయాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.

తగ్గిన భక్తులు..

కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో గత వారం రోజులుగా వివిధ ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. దుర్గ గుడికి నిత్యం సగటున 25 వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడది 3 వేలకు తగ్గింది. సాధారణ రోజుల్లో శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాలకు సగటున 15 వేల మంది వస్తుండగా, ప్రస్తుతం 2-3 వేల మంది మాత్రమే వస్తున్నారు. తిరుపతికి సమీపంలో ఉండటంతో శ్రీకాళహస్తికి సాధారణ రోజుల్లో 25,000-30,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఇప్పుడది 5 వేలకు తగ్గింది. కాణిపాకం ఆలయానికి ప్రస్తుతం నిత్యం వెయ్యిలోపే వస్తున్నారు. కేసులు పెరుగుతున్నందున.. గత ఏడాది మాదిరిగా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అర్చకులతో నిత్య పూజలు మాత్రమే కొనసాగిస్తూ, భక్తుల దర్శనాలు నిలిపేయాలని అర్చక సంఘాలు కోరుతున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,634 కేసులు

ABOUT THE AUTHOR

...view details