రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ విజయరామరాజు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని... వారి నివాస ప్రాంతాల్లో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి సమీక్షిస్తున్నామని తెలిపారు. విశాఖలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయని... ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా వార్తలు ఇవ్వొద్దని మీడియాను కోరారు.
'కరోనా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉంది' - ఏపీపై కరోనా ప్రభావం
కరోనా(కొవిడ్-19) వైరస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ విజయరామరాజు చెప్పారు. రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బాధితులు తిరిగిన ప్రాంతాలను గుర్తించి అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
vijaya rama raju
అసత్య ప్రచారాలు చేస్తే అంటువ్యాధుల నివారణ చట్టం-1897 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే పాఠశాలలు, షాపింగ్‌మాల్స్, థియేటర్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను మూసివేసినట్లు గుర్తుచేశారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని విజయరామరాజు కోరారు.