ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ప్రైవేటులోనూ కరోనా వైద్య సేవలు - కృష్ణా జిల్లాలో కరోనా తాజా వార్తలు

కృష్ణా జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 25 ఆసుపత్రులను గుర్తించిన అధికారులు.. నేటి నుంచి భారీగా రానున్న రైలు ప్రయాణికులదరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.

corona tests available in private hospitals in krishna district
కృష్ణా జిల్లాలో కరోనా వార్తలు

By

Published : May 31, 2020, 4:36 PM IST

కరోనా వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు కృష్ణా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వైద్య సేవలు అందించే ఆసుపత్రుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం విజయవాడ, చినఅవుటుపల్లిలోని 2 ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కొవిడ్ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు 25 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో తాత్కాలిక వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వమే ఉంచనున్నారు. జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో వైద్య, రెవెన్యూ అధికారులతో దీనిపై విజయవాడలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలోని 2 కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 2100 వెంటిలేటర్లు, 5వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ వెల్లడించారు. పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామన్నారు. మరిన్ని ఆక్సిజన్‌ బెడ్స్‌ను అందుబాటులోనికి తెచ్చేందుకు కొత్తగా పైప్‌లైన్‌ను విస్తరించనున్నారు. 2 ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందికి అదనంగా మరికొంతమందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాకు నిత్యం రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు అవసరమైన అదనపు వైద్య బృందాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. విజయవాడకు ఆదివారం నుంచి రోజూ 18 రైళ్లలో ప్రయాణికులు రానున్నారని అధికారులు తెలిపారు. వారందరికీ కచ్చితంగా వైద్య పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి.. యువకుని కిడ్నాప్​.. అరగంటలోనే ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details