కృష్ణలంకలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన ఆసుపత్రి సిబ్బందిని.. స్థానికులు అడ్డుకున్నారు. కరోనా వ్యాధిగ్రస్తుడి అంత్యక్రియలు తమ గ్రామంలో నిర్వహిస్తే.. వైరస్ తమకూ సోకుతుందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ప్రభుత్వ నిబంధనలను పాటించాలని.. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించడంతో స్థానికులు వెనక్కి తగ్గారు. అన్ని జాగ్రత్తలు తీసుకునే అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసులు గ్రామస్థులకు నచ్చచెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం.. కృష్ణా జిల్లా కృష్ణ లంకలో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
కరోనా ఎఫెక్ట్: వ్యక్తి అంత్యక్రియలకు ఆటంకం - కృష్ణా జిల్లాలో కరోనా వార్తలు
ఏ గ్రామంలోనైనా వ్యక్తి చనిపోతే.. ఊరువాడా అంతా కదలి వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కరోనా కాలం. మరణం తరువాత జరిగే అంత్యక్రియలకు సైతం అది అడ్డంగా మారుతోంది. ఓ వ్యక్తి చనిపోతే తన గ్రామస్తులే ఖననం చేయొద్దంటున్నారు. ఈ విషాదం కృష్ణలంకలో జరిగింది.
corona positive person's funeral is interrupted at krishnalanka in krishna district
Last Updated : Apr 6, 2020, 10:41 PM IST