విజయవాడలోని కార్మికనగర్‌లో గురువారం 6 కేసులు నమోదుకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేవలం యువకుల వలనే కార్మికనగర్‌కు ఈ దుస్థితి రావడంతో... ఇకనుంచి కార్మికనగర్, యరంవారి వీధి నుంచి ప్రజలు బయటకు వస్తే క్వారంటైన్‌కి పంపిస్తామని చెప్పారు.
కరోనా విజృంభణ.. కార్మికనగర్‌లో కఠిన ఆంక్షలు - కార్మికనగర్‌లో కరోనా వార్తలు
ఒకేరోజు కార్మికనగర్‌లో ఆరు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నిబంధనలని కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
corona lockdown strictly imposed at Karmakanagar in vijayawada in krishna
లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ... మాచవరంలో అధికారులు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర, నిత్యావసర సరకులు కావాలంటే వాలంటీర్లకు ఫోన్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే.. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Last Updated : May 8, 2020, 5:37 PM IST