ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలను వణికిస్తున్న కరోనా - corona updates in schools in krishna

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు అత్యంత కట్టుదిట్టమైన చర్యల నడుమ ప్రారంభం అయ్యాయి. కానీ గత కొద్ది రోజులుగా పాఠశాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్ గా నమోదవుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Corona agitation in public schools
ప్రభుత్వ పాఠశాలలను వణికిస్తున్న కరోనా

By

Published : Nov 15, 2020, 12:11 PM IST

కొవిడ్ కారణంగా మూసివేసిన పాఠశాలలు నవంబర్ 2 నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే 9 ,10 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికి ఆయా మండలాల్లోని వైద్య సిబ్బంది క్రమపద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ముమ్మరంగా జరుగుతున్న పరీక్షల్లో పలువురికి పాజిటివ్ రావటంతో టీచర్లు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల హైస్కూల్లో ఆరుగురు టీచర్లకు, ఒక ఒక విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా వత్సవాయి హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులు, భీమవరం హై స్కూల్ లో ఒకరికి, వీరులపాడు లో ఒకరికి, గుడిమెట్ల హైస్కూల్లో ఇద్దరికీ, తోటరావులపాడు ఒకరికి చొప్పున పాజిటివ్ నమోదుకాగా.. నందిగామలో ఒక టీచర్ కు పాజిటివ్ గా వచ్చింది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details