కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులకు పరిహారం అందింది. జూన్ 17న వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని ట్రాక్టర్‌పై తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోగా, 9 మంది గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. నేడు ఆ సొమ్మును కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అందజేశారు.