ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్‌ వివాదం.. మరోసారి సర్వేకు పట్టు

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం పరిధిలోని వివాదాస్పద భూములు అభయారణ్యానికి చెందినవా? లేక ప్రభుత్వానివా? సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానాలివే. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటన వేళ చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ భూములపై మరోసారి సర్వే చేపట్టాలని అధికార, ప్రతిపక్ష నేతలూ పట్టుబడుతున్నారు.

mining
mining

By

Published : Aug 1, 2021, 8:32 AM IST

మరోసారి చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్‌ వివాదం

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం పరిధిలో వివాదాస్పద మైనింగ్ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ.. మాజీ మంత్రి దేవినేని ఉమ కొండపల్లి ప్రాంతంలో పర్యటించడం, వైకాపా వర్గాలు అడ్డుకోవడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోసారి సంయుక్త సర్వే జరిపించేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ, అటవీశాఖలపై ఒత్తిడి పెంచుతున్నారు. అవి ప్రభుత్వ భూములైతే.. అక్రమ తవ్వకాలపై అంతగా కేసులు ఉండవు. అదే అభయారణ్యం పరిధిలో ఉంటే కఠిన శిక్షలకు అవకాశం ఉంది. తెలుగుదేశం నేతలు సైతం సర్వే చేస్తే అది అభయారణ్యమే అని తేలుతుంది కాబట్టి మూడోసారి సర్వేకు పట్టుబడుతున్నారు. మరోవైపు రిజర్వు ఫారెస్టులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరుగుతోంది.

ఆ భూములు అటవీ శాఖవే

కొండపల్లి అభయారణ్యం పరిధిలో రూ. కోట్ల విలువైన గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి బంధువు ఇందులో కీలక సూత్రధారి కావడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వివాదాస్పద భూములు అభయాణ్యానికి చెందినవా? ప్రభుత్వానివా? అనే విషయాన్ని తేల్చేందుకు ఇప్పటికే రెండుసార్లు సర్వే జరిగింది. తొలుత 2019లో వేసిన త్రిసభ్య కమిటీ.. వాటిని ప్రభుత్వ పోరంబోకు భుములుగా నిర్ణయించింది. దీంతో క్వారీ లీజులకు అవకాశం కల్పించారు. 2020 ఆగస్టులో విజయవాడ సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా అటవీశాఖాధికారి మంగమ్మ, గనుల శాఖ ఏడీ నాగినితో కూడిన త్రిసభ్య కమిటీ... ఆ భూములు అటవీ శాఖవేనని తేల్చిచెప్పింది. అక్రమ తవ్వకాలు జరిగాయనీ ధ్రువీకరించింది. ఎంతమేర తవ్వకాలు జరిగాయో లెక్కలు తీయాలని అప్పటి కలెక్టర్‌ ఇంతియాజ్‌..జిల్లా అటవీశాఖ అధికారి, గనుల శాఖ డీడీని ఆదేశించారు. ఇవి అమలుకు నోచుకోలేదు.

చర్యలకు రెండో కమిటీ సిఫార్సు..
మొదటి కమిటీ సభ్యులు తప్పుడు నివేదిక ఇచ్చారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రెండో కమిటీ సిఫార్సు కూడా చేసింది. వీటిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఆ భూములు అభయారణ్యం పరిధిలోనే ఉన్నాయని పట్టుబట్టిన డీఎఫ్​వో మంగమ్మ బదిలీ అయ్యారు. తర్వాత వచ్చినవారూ పట్టించుకోలేదు.

ఇదీ చదవండి..

Kondapalli: కొండపల్లిలో అక్రమ మైనింగ్​.. తెదేపా నేతల అడ్డంకులు.. అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details