ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు' - రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు

రాహుల్​ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఈ కార్యక్రమ పోస్టర్​ను విడుదల చేశారు.

'రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు'
'రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు'

By

Published : Jun 15, 2021, 4:36 PM IST


రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఆంధ్రరత్న భవన్​లో వ్యాస రచనల పోటీలకు సంబంధించిన పోస్టర్​ను మస్తాన్ వలీ ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ 51వ పుట్టిన రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని....ఆన్​లైన్ విధానంలో వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

రక్తదానం, అన్నదానంతో పాటు చైతన్య కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఎంఫిల్ పూర్తి చేసిన విద్యావేత్త రాహుల్ గాంధీ..దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో నూతన విధానాలను అమలు చేశారన్నారు. ప్రధాని మోదీ... అంబానీ గ్రూపుకు వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలుగా మారాయని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం

ABOUT THE AUTHOR

...view details