మైలవరంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభం - covid vaccine distribution process in mayilavaram news
కృష్ణా జిల్లా మైలవరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. తొలి విడతలో 44 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాను అందించనున్నారు.
మైలవరంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం
కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. తొలి విడతగా 44 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. మొదటి టీకాను డాక్టర్ శిరీష తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.