ప్రకృతిపై ప్రేమతో...చెట్లపై మమకారంతో... ప్రభుత్వ సహకారంతో ఉద్యానవనాలు పురుడు పోసుకుంటున్నాయి. వాటిని పెంచి పోషిస్తూ...వాటి మాధుర్యాన్ని అనుభవిస్తూ..భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు...విజయవాడలోని టీచర్స్ కాలనీవాసులు.
ఇక్కడ సాయంత్రం సరదాగా కుటుంబంతో కాలక్షేపం చేయొచ్చు. ఆహ్లాదకర వాతవరణాన్ని ఆస్వాదించొచ్చు. విసుగొస్తే స్నేహితులతో పిచ్చాపాటి తిరుగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. పిల్లలు..పెద్దలు అనే తేడా లేకుండాఈ ' టీచర్స్ కాలనీ పార్కు'లో సేద తీరొచ్చు.
మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం
మీరు స్వచ్ఛమైన గాలి పీల్చుతున్నారా... చాలా మంది అవుననే అంటారు. కానీ కెనడా లాంటి దేశాలతో పోల్చితే మనం ఎంత అథమ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. ఆ దేశంలోని చెట్లు ఒక్కొక్కరికీ పంచితే ఒక వ్యక్తికి 9వేల చెట్లు వస్తాయి అక్కడ. ఇండియాలో ఆ సంఖ్య 28 మాత్రమే. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. అనే ప్రశ్నే వారిని కదిలించింది. పదిమందిలో ఆదర్శంగా నిలిపింది.
మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం
ఇవీ చదవండి....అరకు లోయలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం