ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనమలూరు ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్​

కొవిడ్​ కారణంగా మూతపడిన పాఠశాలలు నేటి నుంచి విడతల వారీగా తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు పాఠశాల నిర్వహణలపై సూచనలు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలోని పెనమలూరు ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్ సందర్శించారు.

collector visit school
విద్యార్థులతో ముచ్చటిస్తున్న కలెక్టర్

By

Published : Nov 3, 2020, 7:41 AM IST

Updated : Nov 3, 2020, 7:55 AM IST

నేటి నుంచి విడతల వారీగా పాఠశాలలు తెరుచుకోనుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని పెనమలూరు ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. బడి నిర్వహణలో భాగంగా వైరస్ వ్యాప్తి చెందకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం, శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని జిల్లా పాలనాధికారి తెలిపారు. తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించామని..పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.

Last Updated : Nov 3, 2020, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details