కృష్ణా జిల్లాలో మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ పరిశీలనకు నూజివీడు వచ్చిన కలెక్టర్... నూజివీడు మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు 2 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులలో 73 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం, కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 55 పోలింగ్ కేంద్రాలలో 9 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి - Municipal elections in Andhra Pradesh
ఈనెల 10న జరిగే మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నూజివీడు మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు 2 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులలో 73 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
కలెక్టర్ ఇంతియాజ్