కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 12 లక్షల 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 59 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ అర్బన్ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4.71 లక్షల మందికి వ్యాక్సినేషన్ నిర్వహించామన్నారు. రెండో దశలో యువత నిర్లక్ష్యం అధికంగా కనపడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వపరంగా కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
కరోనా రెండో దశలో యువత నిర్లక్ష్యమే అధికం: కలెక్టర్
కరోనా రెండో దశ కొన్ని కేసుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కొవిడ్ వ్యాప్తి జరగకుండా అందరూ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.
కలెక్టర్ ఇంతియా