సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. 73 వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని మచిలీపట్టణం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ శాఖల్లో అమలవుతున్న పథకాలను వివరిస్తూ చేపట్టిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జేసీ మాధవిలత, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, పలువురు ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు.
సమిష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి: కలెక్టర్ ఇంతియాజ్ - " సమిష్టికృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం " : కలెక్టర్ ఇంతియాజ్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ మైదానంలో జెండాను కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు.
collector-in-independance-day