కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకట రమణ, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహలపై పలు నిర్ణయాలను తీసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 290 క్లస్టర్లు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదని... ఆ ప్రాంతాలను డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.