ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్... తన వైఖరిని బహిరంగంగా తెలియపరచాలని ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నాని చెప్పే వైఎస్ జగన్... ఆయన తండ్రి వైఖరినే అవలంబించాలని కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన సమావేశంలో కోరారు. బీసీలకు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించారని... ఎస్సీ, ఎస్టీలకూ కులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉన్నట్టు హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఇప్పటికే ప్రకటించారనీ.. ఇదే స్ఫూర్తితో అన్ని పార్టీలు తమ డిమాండ్ కు మద్దతు పలకాలని అకాంక్షించారు.
"ఎస్సీ వర్గీకరణపై సీఎం వైఖరేంటి?"
ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ వైఖరేంటని ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. బీసీలకు మాదిరిగానే తమకూ కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై సీఎం వైఖరేంటని ప్రశించిన మంద కృష్ణ మాదిగ
TAGGED:
ఎస్సీ వర్గీకరణ