ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Foundation stone for Bandar Port: బందర్ పోర్టుకు వందల ఏళ్ల నౌకాయాన చరిత్ర : సీఎం జగన్ - వందల ఏళ్ల నౌకాయాన చరిత్ర

CM Jagan laid foundation stone for Bandar Port : దీర్ఘకాలిక స్వప్నంగా ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ స్పష్టం చేశారు. 35 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్ధ్యంతో నాలుగు బెర్తులు నిర్మాణం చేపట్టామని అన్నారు. 16 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 4 పోర్టులు, ఎయిర్ పోర్టులు, 3,600 కోట్ల ఫిషింగ్ హార్బర్​ల నిర్మాణాలతో ఏపీ రూపురేఖలు మారుతాయని అన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 22, 2023, 4:35 PM IST

Updated : May 22, 2023, 7:58 PM IST

CM Jagan laid foundation stone for Bandar Port : వందల ఏళ్ల నౌకాయాన చరిత్ర బందరు పోర్టుదని సీఎం జగన్‌ తెలిపారు. అన్నీ అనుమతులు, టెండర్లు పూర్తి చేసి, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేశామన్నారు. 35 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నాలుగు బెర్తులతో తొలిదశ పోర్టు నిర్మాణం, 116 మిలియన్ టన్నుల సామర్ధ్యం వరకూ విస్తరించే అవకాశం ఉందని అన్నారు. మచిలీపట్నంలోనీ తపసిపూడి వద్ద బందరు పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. అంతకు ముందు సముద్రుడు కి హారతులిచ్చి గంగ పూజ నిర్వహించారు. 5, 156 కోట్ల వ్యయం తో చేపట్టే పోర్టు నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు.

అలాగే పోర్టుకు అనుసంధానంగా రైల్ రోడ్ లైన్లు ఏర్పాటు, నీటి పైప్ లైన్ కూడా ఇస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా రూపురేఖలు మారుతాయని తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కార్గో మచిలీపట్నం పోర్టుకు వస్తుందని సీఎం వెల్లడించారు. చంద్రబాబు 22 వేల ఎకరాలు తీసేసుకోవాలని ప్రయత్నం చేశాడని, అమరావతిలో తన భూములకు రెట్లు రావాలనే కుట్ర చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం 1700 ఎకరాలు ప్రభుత్వ భూమి మరో 240 ఎకరాలు రైతుల భూములు మాత్రమే తీసుకుని పోర్టు నిర్మాణం చేస్తున్నామన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చి వేల మందికి ఉపాధి వస్తుందని, మచిలీపట్నం జిల్లా కేంద్రానికి గతంలో వారంలో ఒక్క రోజు మాత్రమే కలెక్టర్ వచ్చేవారరని ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మారినందున కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉందని అన్నారు. ఇక్కడే ఏర్పాటు అవుతున్న వైద్య కళాశాలలో సీట్లు మొదటి ప్రాధాన్యత బందరు స్థానికులకే ఇస్తామన్నారు.

421 కోట్లతో ఫిషింగ్ హార్బర్ కూడా అందుబాటులోకి వస్తుందని సీఎం తెలిపారు. ఏపీలో ఉన్న పోర్టుల్లో 320 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ సామర్ధ్యం ఉంటే 2025-26 నాటికి మరో వంద మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యం పెంచుతామన్నారు. పోర్టుల వల్ల లక్షల ఉద్యోగాలు ఇక్కడే వస్తాయన్నారు. హైదరాబాద్​కు, బెంగుళూరుకో మన యువత వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, హార్బర్​లకు 3,600 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్​లు వాటికి అనుసంధానంగా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

డిబిటి ద్వారా 2.10 లక్షల కోట్లు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇళ్లు, ఇళ్ల పట్టాల ద్వారా కనీసంగా 1.5లక్షల కోట్లు ఇచ్చినట్టేనన్నారు. అమరావతి ప్రాంతంలో కూడా 50 వేల మందికి ఇళ్లు , ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే దానికి భగ్నం కల్పిస్తున్నారన్నారు. పేదలకు అవకాశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీలా అమరావతిని నిర్మిస్తారా అని సీఎం ప్రశ్నించారు. పేదల అక్కడ పని చేసి రాత్రి పూట వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలా అని నిలదీశారు. ఇలాంటి ఆలోచనలకు ఎలా మద్దతు ఇస్తామని అన్నారు. అందుకే పేదలకు అండగా నిలిచేందుకు 50 వేల మందికి ఇళ్ళ పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ నెల 26 తారీకున అమరావతిలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు.

ఎస్సీలను, బీసీలను, మహిళలను, పేద వర్గాలపై దాడి చేసింది, మూడు రాజధానులు వ్యతిరేకంగా అన్ని ప్రాంతాలను అవమానించింది కూడా చంద్రబాబేనని అన్నారు. సెంటు భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు దానిని సమాధితో పోలుస్తారా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.

అంతకు ముందు సీఎం జగన్ మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్స్ నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంగణం వరకూ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన పోర్టు, మెడికల్ కళాశాల భవన నిర్మాణ చిత్ర ప్రదర్శన తిలకించారు.

ఇవీ చదవండి :

Last Updated : May 22, 2023, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details