నటుడు మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.
చిరంజీవి స్వయంకృషి, సామాజిక సేవా స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి సంపూర్ణ ఆయురారోగ్యం, ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.