ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టెస్ట్ చేయకుండానే.. పాజిటివ్, నెగిటివ్ మెసేజ్​లు: చంద్రబాబు

రాష్ట్రంలో 10 లక్షల కరోనా టెస్టులు చేశామని వైకాపా చెప్తున్న మాటలు అవాస్తవమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ‘ఎస్​ఎంఎస్ టెస్టింగ్ రాకెట్’ వెనుక ఉన్న నేరపూరిత ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేయాలని కేంద్రాన్ని కోరారు.

chandrababu
chandrababu

By

Published : Jul 7, 2020, 7:55 AM IST

కరోనా‌ టెస్టుల పేరుతో జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిలియన్ కోవిడ్ పరీక్షలు ఓ మోసపూరిత కుంభకోణమని వ్యాఖ్యానించారు. నమూనాలు సేకరించని వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉందనీ.. లేదా నెగిటివ్‌ అంటూ ఎస్‌ఎంఎస్‌లు వస్తున్న వైనంపై అనంతపురం జిల్లాకు చెందిన ఒక వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో విడుదల చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఎంతటికైనా దిగజారగలదన్న తీరు చూసి షాక్​కి గురయ్యానని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ‘ఎస్​ఎంఎస్ టెస్టింగ్ రాకెట్’ వెనుక ఉన్న నేరపూరిత ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

కరోనా పరీక్ష చెయ్యకుండానే కరోనా పాజిటివ్ అని మొబైల్​కి ఎస్‌ఎంఎస్‌లు వచ్చే అద్భుతాలు వైకాపా పాలనలోనే జరుగుతున్నాయంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. అంతా పారాసిటమాల్ మహిమ అంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా గాలి మాటలు, గొప్పలు మాని ప్రజారోగ్యంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలుకుతూ ఓ వీడియోను లోకేష్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details