'రాజధానికి మణిహారంలా కొండపల్లి' - chandrababu
కృష్ణాజిల్లా కొండపల్లి కోట శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కొండపల్లి ఖిల్లాను పురావస్తు, మ్యూజియంల శాఖ పునరుద్ధరించారు. కొండపల్లికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కృష్ణాజిల్లా కొండపల్లి కోట శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
కృష్ణాజిల్లా కొండపల్లి కోట శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కొండపల్లి ఖిల్లాను పురావస్తు, మ్యూజియంల శాఖ పునరుద్ధరించారు. కొండపల్లికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కొండపల్లిని పర్యాటక కేంద్రంగా తయారుచేసేందుకు నిధులిచ్చామన్నారు. రాజధానికి కొండపల్లి మణిహారంలా తయారవుతుందని అన్నారు. అమరావతికి వచ్చిన ప్రతిఒక్కరూ కొండపల్లికి వచ్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.