ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐదుగురు తెలుగువారికి 'పద్మ' అవార్డులు రావడం గర్వకారణం' - పద్మా అవార్డులు 2020

దివంగత గాయకుడు, గాన గంధర్వడు బాలసుబ్రమణ్యానికి కేంద్రం ‘‘పద్మవిభూషణ్’’ ప్రకటించడంపై తెదేపా అధినేత హర్షం వ్యక్తం చేశారు. ఐదుగురు తెలుగువారికి పద్మ అవార్డులు రావడం ఆనందదాయకమని అన్నారు.

chandra babu wishes to padhma award recipients
chandra babu wishes to padhma award recipients

By

Published : Jan 26, 2021, 1:01 PM IST

ఈ ఏడాది ఐదుగురు తెలుగువారికి 'పద్మ' అవార్డులు రావడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గానగంధర్వుడు బాలసుబ్రమణ్యానికి ‘‘పద్మవిభూషణ్’’ ఇవ్వడాన్ని స్వాగతించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ రావు, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, తెలంగాణకు చెందిన కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు పొందిన ఐదుగురు తెలుగు ప్రముఖుల ప్రతిభా సంపత్తులను కొనియాడారు. ఈ పురస్కారాలు లభించడంపై వారిని, కుటుంబ సభ్యులను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details