ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ భేష్: కేంద్రమంత్రి - \ krishna district

రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నందివాడ మండలం జనార్ధనపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

central minister giriraj singh visit to tha janardhanapuram at krishna district

By

Published : Sep 6, 2019, 7:07 PM IST

జనార్ధనపురంలో పర్యటించిన కేంద్ర మత్స్య శాఖ మంత్రి

ఆక్వా,మత్స్య సంపద వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ భేషుగ్గా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డికి సంబందించిన చేపల చెరువులను పరిశీలించారు.ఫంగస్ చేపల పెంపకం విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.ఫంగస్ రకం చేపల ధరలు పడిపోవడాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఆక్వా రైతులు మేత ఖర్చులు తగ్గించుకువడంపై దృష్టి సారించాలని,తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలని కేంద్రమంత్రి అన్నారు.పాడి,మత్స్య పరిశ్రమల వైపు యువత మొగ్గు చూపుతున్నందున వారికి వివిధ కేంద్ర పథకాల ద్వారా చేయూత అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details