ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ వివరాలివ్వండి.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ సీఎస్​కు సీబీఐ లేఖ - telangana latest news

CBI letter to CS on MLA poaching case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యే ఎర కేసు అంశంలో సీబీఐ అధికారులు తెలంగాణ సీఎస్​కు లేఖ రాశారు. ఈ లేఖలో వారు మొయినాబాద్​ పోలీసుస్టేషన్​లో నమోదైన ఎమ్మెల్యే ఎర కేసు ఎఫ్​ఐఆర్​ వివరాలు అందించాలని కోరారు.

తెలంగాణ సీఎస్ కు సీబీఐ లేఖ
తెలంగాణ సీఎస్ కు సీబీఐ లేఖ

By

Published : Feb 8, 2023, 10:28 PM IST

CBI letter to CS on MLA poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు మరోసారి తెలంగాణ సీఎస్​కు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన రాసిన లేఖలో మెయినాబాద్ పీఎస్​లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడిన తర్వాత సీబీఐకి చెందిన ఢిల్లీ ఎస్పీ సుమన్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇదివరకు సీబీఐ 5సార్లు సీఎస్​కు లేఖ రాశారు.

సిట్ దర్యాప్తును నిలిపేస్తూ, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి గత డిసెబంర్ 26న తీర్పు ఇచ్చారు. తీర్పునకు సంబంధించిన ప్రతులు 28వ తేదీన బయటకు వచ్చాయి. ఆ ప్రతులు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న తర్వాత, అదే నెల డిసెబంర్ 31వ తేదీన సీఎస్ కు లేఖ రాశారు. మెయినాబాద్ పీఎస్​లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇవ్వాలని లేఖలో కోరారు.

ఆ తర్వాత జనవరి 5, 9, 11, 26 తేదీల్లోనూ సీబీఐ అధికారులు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సీబీఐకి వివరాలు పంపించలేదు. ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 17వ తేదీన విచారిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి తెలిపింది. మెయినాబాద్ పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details