ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో సీబీఐ సోదాలు... ఎక్కడెక్కడ..?

దేశవ్యాప్తంగా 187చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.7,200కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాల కేసుల నేపథ్యంలోనే ఈ సోదాలు జరిపినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దిల్లీ, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దాద్రానగర్ హవేలీలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.

రాష్ట్రంలో సీబీఐ సోదాలు

By

Published : Nov 6, 2019, 6:32 AM IST

రాష్ట్రంలో సీబీఐ సోదాలు

దేశవ్యాప్తంగా 187చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. దింట్లో భాగంగానే కృష్ణా జిల్లాలోనూ తనిఖీలు చేపట్టింది. ఆక్వా రంగంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని... ఎగవేతకు పాల్పడుతున్నారని సీబీఐ గుర్తించినట్లు తెసిలింది. గుడివాడలో ఈ తరహాలో ఋణం తీసుకున్నట్టు సీబీఐ తనిఖీలో బయటపడినట్లు సమాచారం. కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్, ఎస్​బీఐ, కెనరా, దేనా, పంజాబ్ బ్యాంకులతో పాటు మరికొన్నింట్లో తనిఖీలు చేశారు. కానీ ఎక్కడెక్కడ తనిఖీలు చేశారనేది పూర్తిగా బయటకు రాలేదు. మీడియా కంట పడకుండా ఈ తనిఖీలు కొనసాగాయి.

ABOUT THE AUTHOR

...view details