కృష్ణా జిల్లా మైలవరంలో మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 రోజులుగా మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారుల దాహర్తిని తీరుస్తున్నారు. మండే ఎండల్లో తమకు కొంత ఉపశమన్నాన్ని కలిగిస్తున్న సేవా సంస్థల దాతృత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మంచి నీరు సైతం కొనుక్కుని తాగే రోజుల్లో మజ్జిగ పంపిణీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఈశ్వరరావు పాల్గొన్నారు.
మైలవరంలో ఉచిత మజ్జిగ పంపిణీ - lions club
భగభగ మండే ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మైలవరం స్థానిక ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్ నడుం బిగించింది. ఉచిత మజ్జిగ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారుల కడుపును చల్లగా నింపుతున్నారు.
మైలవరంలో సేవ సంస్థల దాతృత్వం- ఉచిత మజ్జిగ పంపిణీ