ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న బస్సుకు లారీ ఢీ.. డ్రైవర్ మృతి - గన్నవరం

కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

bus_accident_at_gannavaram_driver_died

By

Published : Aug 7, 2019, 9:05 AM IST

ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ..డ్రైవర్ మృతి

కృష్ణా జిల్లా గన్నవరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై.. రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు శాంతి థియేటర్ ఎదుట టైర్ పంచర్ అయింది. ఈ క్రమంలో డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. వెనక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ ఘటన స్థలంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details