'వేటూరి'కి కాంస్య విగ్రహం - bala subrahmanyam
కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో వేటూరి సుందరరామ మూర్తి కాంస్య విగ్రహాన్ని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.
కృష్ణాజిల్లా మోపీదేవి మండలం పెదకళ్లేపల్లిలో ప్రముఖ సినీగీత రచయిత వేటూరి సుందరరామ మూర్తి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీ సాహిత్య దీప్తి... తెలుగు భాషోద్యమ స్ఫూర్తి... డాక్టర్ వేటూరి సుందర రామమూర్తి గారి జన్మస్థలం పెదకళ్లేపల్లి. మొదట్లో పాత్రికేయ వృత్తి చేపట్టిన ఆయన... తర్వాత సినీ గేయరచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయికి చేరుకున్నారు. సుందరరామ మూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. సినీ, రాజకీయ ప్రముఖులు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.