కృష్ణా జిల్లా ఘంటసాల మండలం వేములపల్లిలో పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జతిన్(10)ను పాము కాటేసింది. తల్లిదండ్రులు చల్లపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా... ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు చనిపోయాడు. బాలుడిని తరలిస్తున్న అంబులెన్స్ ఉయ్యూరు వద్ద మొరాయించడంతో దాదాపు రెండు గంటలు అక్కడే వేచిఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మొరాయించిన అంబులెన్స్... బాలుడు మృతి! - snake
ఓ బాలుడిని పాము కరిసింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా... అంబులెన్స్ మొరాయించింది. రెండు గంటలు ఆలస్యం కావడం వల్లే తమ కొడుకుని మృత్యువు కభళించిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
పాముకాటుతో బాలుడి మృతి