తల్లితో పాటు సరదాగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన చిన్నారి పలుగు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఉత్సాహంగా గడిపిన బాలుడు... కొంతసేపటికే విగతజీవిలా మారాడు.
ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదన
By
Published : May 17, 2019, 9:35 PM IST
చిన్నారి మృతి
కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ బాలుడు పలుగు దిగి మృతి చెందాడు. కోట నర్సయ్య కుమారుడు నవీన్ (11 ) తల్లి రుక్మిణితో కలసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. తిరిగి వేరొకరి బైక్ పై ఇంటికి వస్తుండగా చేతిలో ఉన్న పలుగు జారిపడి కడుపులో దిగబడింది. నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి తిరువూరు ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.