ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి లేకుండా ప్రయాణికుల తరలింపు.. పడవ సీజ్​ - చందర్లపాడు మండలం తాజా వార్తలు

అనుమతి లేకుండా ప్రయాణికుల్ని తరలిస్తున్న ఓ పడవను చందర్లపాడు పోలీసులు సీజ్​ చేశారు. మండలంలోని రామన్నపేటలో కృష్ణా నది నుంచి గుంటూరు జిల్లా తాడ్వాయి రేవుకు ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతి లేకుండా పడవలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

boat seized carrying passengers without permission
అనుమతి లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న పడవ సీజ్

By

Published : Jan 21, 2021, 1:32 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో కృష్ణా నది నుంచి గుంటూరు జిల్లా తాడ్వాయి రేవుకు ప్రయాణికులను, ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా తరలిస్తున్న పడవను పోలీసులు సీజ్ చేశారు. ప్రయాణికుల్ని తరలిస్తున్నారన్న సమాచారంతో చందర్లపాడు ఎస్సై యేసోబు... రేవులో తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా ప్రయాణకుల్ని చేరవేస్తున్న పడవలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అనుమతులు లేకుండా నదిలో పడవలు నడపడానికి వీలు లేదని .. పడవల్లో ప్రయాణికులను తరలించడం నేరం అని తేల్చి చెప్పారు. పడవ అదుపుతప్పి నదిలో పడిపోతే ప్రజలు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details