ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా అసలైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుందని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటామని, ప్రజాక్షేత్రంలో వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కొంటామని వెల్లడించారు. భాజపాను మాత్రమే రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా ప్రజలు నమ్ముతున్నారని సోము వీర్రాజు అన్నారు. అవసరమైతే న్యాయస్థానాలు, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి... కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుంది: సోము వీర్రాజు - mptc, zptc elections in andhrapradhesh
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ప్రజా క్షేత్రంలో వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కొనే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు