మసకబారిన ద్వీపం... పునరుద్ధరణకు పట్టెను సమయం.... - BHAVANI_ISLAND
కృష్ణానది వరద ప్రవాహ ఉద్ధృతికి విజయవాడ బెరంపార్కు సమీపంలోని భవానీ ద్వీపం కకావికళమైంది. వారం రోజుల పాటు కొనసాగిన ప్రవాహం ధాటికి ద్వీపంలోని నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కృష్ణానది వరద ప్రవాహ ఉద్ధృతికి విజయవాడ బెరంపార్కు సమీపంలోని భవానీ ద్వీపం కకావికళమైంది. వారం రోజుల పాటు కొనసాగిన ప్రవాహం ధాటికి ద్వీపంలోని నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున మట్టి, ఇసుక మేటలు వేసి ద్వీపం స్వరూపం మారిపోయింది. ప్రాథమిక అంచనా ప్రకారం 3 నుంచి 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితి తీసుకొచ్చి పర్యాటకులను అనుమతించేందుకు మరో నాలుగైదు రోజులు పట్టనుండగా... పూర్తి స్థాయి పునరుద్ధరణకు నెల రోజులపైనే పట్టే అవకాశం ఉంది. వరదల ధాటికి రూపం కోల్పోయిన భవానీ ద్వీపం తాజా పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.