భర్త కోసం ఓ భార్య అత్తింటి వారిపై పోరాటానికి దిగింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అనూష.... అత్తమామలు తనకు అన్యాయం చేస్తున్నారంటూ అత్తింటి ముందు బైఠాయించింది. తన భర్తకు రెండో పెళ్లి చేస్తామంటూ ఏడాదిగా అత్తమామలు మానసికంగా వేధిస్తున్నారన్నారు. రెండు నెలలుగా భర్తను తన ఇంటికి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. భార్యా పిల్లలు ఉండగా రెండో పెళ్లికి సిద్ధపడ్డ భర్త రామచంద్రరావుతో పాటు మామ కృష్ణపై బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి భర్త కావాలంటూ అత్తింటి వద్ద నిరసన చేపట్టింది.
భర్త కోసం పోరాటం - WE WANT JUSTICE
భర్త కోసం ఓ భార్య అత్తింటి వారిపై పోరాటానికి దిగింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అనూష.... అత్తమామలు తనకు అన్యాయం చేస్తున్నారంటూ అత్తింటి ముందు బైఠాయించింది.
భర్త కోసం పోరాటం