బెజవాడ బార్ అసోసియేషన్‌పై కరోనా ప్రభావం పడింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా నేటి నుంచి 30వ తేదీ వరకు కార్యాలయం మూసివేస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పి.రామకృష్ణ తెలిపారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యాలయానికి ఎవరూ రావొద్దని సూచించారు.
నేటి నుంచి 30వ తేదీ వరకు బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం మూసివేత - Bezwada Bar Association office latest news
రెండో దశ కరోనా విజృభిస్తున్న వేళ పలు చోట్ల మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. కొవిడ్ తీవ్రత దృష్ట్యా నేటి నుంచి 30వ తేదీ వరకు బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం