ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

ఎన్టీఆర్ వైద్య కళాశాల కౌన్సెలింగ్ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతుంది. 550 జీవో సరైన రీతిలో అమలుచేయాలని బీసీ సంఘాలనేతల ఆందోళన చేపట్టారు. రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

By

Published : Aug 6, 2019, 11:28 PM IST

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

'ఎన్టీఆర్ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ రద్దు చేయాలి'
వైద్య విద్య ప్రవేశాల కోసం జరుగుతున్న సీట్ల భర్తీ ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. భర్తీ ప్రక్రియలో 550 జీవో అమలు చేయకుండా బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ బీసీ విద్యార్థి సంఘాల నేతలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. రెండో రౌండులో జరిగిన భర్తీ ప్రక్రియను రద్దు చేసి రీ-కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వైద్య విద్యకోసం విశ్వవిద్యాలయ అధికారులు రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ సమయంలో 550 జీవో అమలు సరైన రీతిలో చేయలేదని బీసీ సంఘాలు ఆందోళనకు దిగటం వలన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. మొదటి విడత జరిగిన సీట్ల భర్తీ ప్రక్రియ నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని.. వాటిపై నిర్ణయం వచ్చాక భర్తీ ప్రక్రియ చేపడతామని వర్శిటీ అధికారులు చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details