ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.42 కోట్ల రుణం ఎగవేత..10 దుకాణాల వేలానికి కోర్టు అనుమతి - కృష్ణాజిల్లా ముఖ్యంశాలు

నందిగామలో గోపు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన స్థలాలు, దుకాణాలపై ఎస్​బీఐ బ్యాంకులో ఏకంగా 42 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవటంతో బ్యాంకు వారు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు 10 దుకాణాలను వేలం వేసి వచ్చిన డబ్బును.. రుణంలో చెల్లించుకోవాలని ఉత్తర్వులను జారీ చేసింది.

దుకాణుదారులతో మాట్లాడుతున్న బ్యాంకు అధికారులు, పోలీసులు
దుకాణుదారులతో మాట్లాడుతున్న బ్యాంకు అధికారులు, పోలీసులు

By

Published : Mar 24, 2021, 10:36 PM IST

Updated : Mar 25, 2021, 12:16 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో గోపు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన స్థలాలు, దుకాణాలపై ఎస్​బీఐ బ్యాంకులో 42 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. ఈ అప్పు తీసుకుని 20సంవత్సరాలు అయినా యజమాని అప్పు చెల్లించని కారణంగా.. ఎస్‌బీఐ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వాదోపవాదనలు విన్న కోర్టు 10 దుకాణాలను వేలం పెట్టి వచ్చిన డబ్బు ద్వారా తమ రుణంలో చెల్లించుకోవాలని ఉత్తర్వులను జారీచేసింది. అయితే దుకాణాల్లో అద్దెకి ఉండేవారు తాము ఖాళీ చేయబోమని.. తమకు ముందుగా ఎవరు తెలియపరచలేదని పోలీసులతో, బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Last Updated : Mar 25, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details