రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 80వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. కరోనా పరీక్షా ఫలితాలు వచ్చేలోగా రోగి చనిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబంలో ఒకరి శాంపిల్ తీసుకుంటే, వారి ఫలితం వచ్చే వరకు మరొకరికి పరీక్ష చేయమని చెబుతున్నారని వీరాంజనేయ స్వామి అన్నారు. సరైన వైద్యం లేక రాష్ట్రంలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాజిటివ్ రోగులకు వెంటిలేటర్ల సదుపాయం కూడా దొరకడం లేదని వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు.
'ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి'
కరోనా బాధితులకు సౌకర్యాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రభుత్వ చర్యల కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి