ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాడులు, వేధింపులతో ప్రభుత్వం ఏమీ సాధించలేదు' - ప్రభుత్వంపై బచ్చుల అర్జునుడు విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శలు గుప్పించారు. దాడులు, వేధింపులతో ఏమీ సాధించలేరన్నారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి.. ప్రతిపక్ష నేతలను, దళితులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

bachhula arjunudu criticises ycp government
బచ్చుల అర్జునుడు, తెదేపా ఎమ్మెల్సీ

By

Published : Aug 27, 2020, 4:49 PM IST

దాడులు, వేధింపులతో వైకాపా ప్రభుత్వం ఏమీ సాధించలేదని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం దాడుల ఆంధ్రప్రదేశ్ గా, అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని.. 16 నెలల నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

సొంత బాబాయి హత్య జరిగితే జగన్ ఏం చేశారని నిలదీశారు. పరిశ్రమలు, కంపెనీలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందన్న ఆలోచన పాలకులకు లేదని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు అవినీతి చరిత్ర బట్టబయలైందని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి పనులు చేస్తున్న వైకాపా వారిని వదిలేది లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details