కృష్ణాజిల్లా నందిగామ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటో అనాసాగరం వద్ద బోల్తా పడింది. ఎదురుగా మద్యం సేవించి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించపోయినట్లైతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. గాయపడిన వారంతా తోటచర్ల, జగ్గయ్యపేట, కొనకంచికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఆటో బోల్తా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు - anasagaram
నందిగామ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటో అనాసాగరం వద్ద బోల్తా పడింది. ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఆటో బోల్తా